News February 18, 2025

బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు

image

AP: బీసీల్లో వెలుగులు నింపేందుకు CM CBN కృషి చేస్తున్నారని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. ఆదరణ-3 పథకం ద్వారా 80వేల మంది మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టుమిషన్లను అందజేయనున్నట్లు వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 50 శాతం రాయితీతో జనరిక్ ఔషధ షాపుల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. కల్లు గీత, కుమ్మరి, వడ్రంగి, వడ్డెర, భవన నిర్మాణ కార్మికులకు తోడ్పాటునందిస్తామన్నారు.

Similar News

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.

News December 1, 2025

ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

image

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>