News December 30, 2024
రేపు హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం!

TG: న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మద్యం మత్తులో ప్రమాదాలకు గురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Similar News
News September 25, 2025
దుర్గగుడిలో ప్రొటోకాల్ దర్శన వేళలు మార్పు: ఈవో

AP: దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రొటోకాల్ దర్శన వేళలు మార్చినట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉ.5-6 గంటల వరకు, మ.3 నుంచి 4 గంటల వరకు, సా.8 నుంచి 9 గంటల వరకు ప్రొటోకాల్ దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తుల కోసమే ఈ మార్పు చేపట్టినట్లు వెల్లడించారు. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఇవాళ అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
News September 25, 2025
వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.
News September 25, 2025
ఒత్తిడి చాలా ప్రమాదకరం: అక్షయ్ కుమార్

నేటి ప్రపంచంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలతో ప్రెషర్‌కు గురై జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దని ఓ షోలో చెప్పారు. సాదాసీదాగా జీవితాన్ని గడపాలని సూచించారు. తాను అందరిలాగే సెలవులు తీసుకుంటానని, ఏడాదిలో 125 రోజులు బ్రేక్‌లో ఉంటానని పేర్కొన్నారు. ఆదివారాలు, సమ్మర్ వెకేషన్, దీపావళికి 3 రోజులు సెలవులో ఉంటానని పేర్కొన్నారు. సమయపాలన పాటించడం చాలా ముఖ్యమన్నారు.