News August 27, 2025

ఆ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ

image

AP: ఆర్టీసీకి త్వరలోనే 1,500 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రానున్నాయని ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా వాటిలోనూ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. స్త్రీ శక్తి కారణంగా పాత రూట్లు రద్దు చేసే ఆలోచన లేదని, అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Similar News

News August 27, 2025

అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!

image

అగ్రరాజ్యం అమెరికాను ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్లి (గాయాలైన చోటు నుంచి ప్రవేశిస్తుంది.) మాంసాన్ని తినేస్తుంది. దీంతో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. మేరీలాండ్‌లో తొలిసారిగా ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి వల్ల మనుషులకు ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.

News August 27, 2025

వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్?

image

TG: స్థానిక ఎన్నికల షెడ్యూల్ SEP తొలి వారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. SEC <<17525625>>ఆదేశాల<<>> నేపథ్యంలో ఈ నెల 30న క్యాబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. ముందుగా MPTC, ZPTC ఎన్నికలను వచ్చేనెల చివరి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వారానికే అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. కాగా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News August 27, 2025

భారీ వర్షం.. పండగ పనులకు ఆటంకం

image

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలనుకున్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాల వల్ల మండపాలన్నీ తడిచి ముద్దయ్యాయి. పూజా సామగ్రి, ఇతర వస్తువుల కోసం బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ‘ఇవాళ ఒక్కరోజు వర్షాన్ని ఆపు గణపయ్యా’ అని భక్తులు వేడుకుంటున్నారు.