News November 2, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశువైద్య శిబిరాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. FEB నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. దీర్ఘకాలంగా గర్భం దాల్చని పశువులకు చికిత్స, ఎదలో ఉన్న వాటికి కృత్రిమ గర్భదారణ, సూడి పరీక్షలు చేస్తామన్నారు. దూడలకు నట్టల నివారణ మందులు, విటమిన్ ఇంజెక్షన్లు, పాల దిగుబడిపెంచే ఖనిజ లవణాల మిశ్రమాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 2, 2024

విశాఖ- విజయవాడ మధ్య 16 జనసాధారణ్ రైళ్లు

image

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో పూర్తిగా అన్‌రిజర్వుడు బోగీలు ఉంటాయి. నవంబర్ 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో వీటిని నడపనున్నారు. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరంలో హాల్టింగ్ ఉంటుంది.

News November 2, 2024

మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

image

AP: నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెంకటాచలం మండల టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కాకాణిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.

News November 2, 2024

APPLY: నవంబర్ 28 వరకే ఛాన్స్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వాళ్లంతా 2024 నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకు ఫాం-6, అభ్యంతరాలకు ఫాం-7, సవరణలకు ఫాం-8 నింపాలి. voters.eci.gov.in లేదా voter helpline యాప్ ద్వారా కూడా దరఖాస్తు చూసుకోవచ్చు. > TOLL FREE 1950