News March 17, 2024

స్వేచ్ఛాయుత ఓటింగే లక్ష్యం: రోనాల్డ్ రోస్

image

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మే 13న జిల్లా పరిధిలోని HYD, SEC పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుందని, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉపఎన్నిక ఉంటుందన్నారు. ఫిబ్రవరి 8 నాటికి లెక్కల ప్రకారం జిల్లాలో 45,70,138 మంది ఓటర్లున్నారని, గడిచిన 2 నెలల్లో 1.21 లక్షల ఓట్లు రద్దయ్యాయని, 46,574 మంది కొత్తఓటర్లు జాబితాలో చేరారన్నారు.

Similar News

News September 21, 2024

HYD: నాలుగేళ్లలో 50 వేల మందికి SKILL ట్రైనింగ్

image

వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని HYD నగరంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదు అయినట్లుగా పేర్కొన్నారు.

News September 21, 2024

HYD: నేపాల్ వాళ్లకు సైతం ఇక్కడే ట్రైనింగ్!

image

రాజేంద్రనగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రోగ్రాంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ హోం అఫైర్స్ కేంద్రమంత్రి నిత్యానందతో పాల్గొన్నారు. తామిద్దరం 16వ లోక్ సభలో సహచరులుగా ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు. నేపాల్, భూటాన్ ప్రాంతానికి చెందిన వారు సైతం ఇక్కడే ట్రైనింగ్ పొందినట్లు ఎంపీ పేర్కొన్నారు.

News September 21, 2024

HYD: 5 మార్గాల్లో 78.6 కి.మీ మెట్రో

image

HYD నగరంలో రెండో దశ మెట్రో ట్రైన్ 5 మార్గాల్లో కలిపి అధికారులు 78.6 కి.మీ ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలు మార్లు సీఎం చేసిన సూచనల మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.