News September 1, 2025

ఫ్రీడమ్ ప్లాన్.. గడువు పొడిగించిన BSNL

image

కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన <<17269129>>ఫ్రీడమ్ ప్లాన్<<>> గడువును BSNL పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 15వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.

Similar News

News September 22, 2025

ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ నం.1

image

ఆయిల్ పామ్ సాగులో TG దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. దీని సాగు పెంచేలా 2021 నుంచి ఐదేళ్లకు గానూ కేంద్రం 9 రాష్ట్రాలకు 3.22 లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించింది. తమకు నిర్దేశించిన 1.25 లక్షల హెక్టార్లలో 78,869 హెక్టార్లు సాగు చేసి TG ముందులో నిలిచింది. AP 67,727 హెక్టార్లు, ఒడిశా 4946, KA 5088 హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా లక్ష్యం త్వరలో చేరుకుంటామని TG మంత్రి తుమ్మల తెలిపారు.

News September 22, 2025

ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై<<>> ఆవడిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌ 20 జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. బీటెక్, BE, MBA ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులైనవారు అప్లికేషన్లను OCT 11వరకు ఆర్డినరీ పోస్టు ద్వారా పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News September 22, 2025

రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

image

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.