News January 22, 2025
ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు మరో 2 నెలలు బంద్

AP: నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా, పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2 నెలలు పొడిగించింది. అక్రమాలపై పూర్తి సమాచారం పంపాలని కలెక్టర్లను ఆదేశించింది.
Similar News
News November 28, 2025
అన్నమయ్య: తుఫాన్ హెచ్చరికలు.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు సిబ్బందితో కార్యనిర్వహణ కొనసాగిస్తుండగా.. ఎమర్జెన్సీ సహాయక చర్యలకు అందుబాటులో ఉందని కలెక్టర్ చెప్పారు. సహాయక చర్యల కోసం 08561-293006 నంబర్కు కాల్ చేయవచ్చని సూచించారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.
News November 28, 2025
డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.


