News September 23, 2024

ఫ్రెంచ్ ఫ్రైస్ మహా ప్రమాదం: వైద్యులు

image

ఫ్రెంచ్ ఫ్రైస్‌కి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమ, మద్యపానం కంటే ఇవి మరింత డేంజర్‌ అని తెలిపారు. ‘ఆలూ అనేదే కార్బోహైడ్రేట్లతో కూడుకున్నది. మధుమేహ బాధితులకు అనారోగ్యకరం. ఇక ఆ ఫ్రైస్‌ను వేపిన నూనెను అప్పటికే ఎన్నిసార్లు వేడి చేసి ఉంటారో లెక్క కూడా ఉండదు. ఆ నూనెతో ఫ్రైస్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్ తీవ్రంగా పెరుగుతాయి. ఇవి గుండెకు అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు.

Similar News

News September 23, 2024

దామచర్ల వ్యాఖ్యలపై పవన్‌కు ఫిర్యాదు చేస్తా: బాలినేని

image

AP: తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన <<14167036>>వ్యాఖ్యలు<<>> సరికాదని మాజీ MLA బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్లు తెలిపారు. దామచర్ల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైసీపీలో ఇబ్బందుల కారణంగానే తాను జనసేనలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

News September 23, 2024

పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా?

image

దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తుండటంతో ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు అధికారిక వెబ్‌సైట్లలోనే కొనుగోలు చేయాలి. మెసేజ్, ఈ-మెయిళ్లకు స్పందించకపోవడం ఉత్తమం. స్పందిస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. అన్ని పోర్టల్‌లకు ఒకే పాస్ వర్డ్ ఉపయోగించకూడదు. ఫ్రీ హాట్‌స్పాట్‌లు ఉపయోగించి షాపింగ్ చేయొద్దు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది.

News September 23, 2024

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: టీపీసీసీ చీఫ్

image

TG: కార్యకర్తలు, నాయకులకు అనునిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.