News June 6, 2024
ఫ్రెంచ్ ఓపెన్: మిర్రా ఆండ్రీవా అరుదైన రికార్డ్
ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఆర్యనా సబలెంకాపై (బెలారస్) గెలుపొందిన మిర్రా ఆండ్రీవా (రష్యా) అరుదైన రికార్డ్ నెలకొల్పింది. 1997 తర్వాత గ్రాండ్ స్లామ్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత పిన్నవయస్కురాలిగా (17ఏళ్లు) నిలిచింది. 1997 US ఓపెన్‌లో స్వీస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ 16ఏళ్ల వయసులో సెమీస్‌కు చేరి రికార్డ్ నెలకొల్పారు. కాగా ఆండ్రీవా, సెమీస్‌లో జాస్మిన్‌ను (ఇటలీ) ఎదుర్కోనుంది.
Similar News
News January 10, 2025
RRRపై టార్చర్ కేసు.. విజయ్‌పాల్‌కు బెయిల్ నిరాకరణ
AP: రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా రెండో అదనపు కోర్టు కొట్టేసింది. విచారణ సందర్భంగా తనను విజయ్‌పాల్ చిత్రహింసలు పెట్టారని RRR ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదుకాగా, నిన్నటితో పోలీస్ కస్టడీ ముగిసింది.
News January 10, 2025
తెలంగాణకు సం‘క్రాంతి’లేదా?
సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.
News January 10, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. హరీశ్ తన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరోసారి విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్‌కు నోటీసులు జారీచేసింది.