News June 7, 2024
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్లోకి దూసుకెళ్లిన స్వైటెక్

ఫ్రెంచ్ ఓపన్ ఉమెన్ సింగిల్స్ కేటగిరీలో ప్రపంచ నం.1 ఇగా స్వైటెక్ ఫైనల్‌కు (పోలాండ్) దూసుకెళ్లారు. సెమీస్‌లో కోకో గౌఫ్పై (US) 6-2, 6-4 తేడాతో గెలుపొందారు. కాగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరుకోవడం గత ఐదేళ్లలో ఇది నాలుగోసారి. మరోవైపు మెన్స్ డబుల్స్ విభాగం సెమీస్‌లో భారత ఆటగాడు రోహన్ బొప్పన్న- ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయానికి ఎదురుదెబ్బ తగిలింది. బొలెల్లి-వావసోరీ (ఇటలీ) చేతిలో ఓడిపోయారు.
Similar News
News September 11, 2025
ఉత్తరాఖండ్‌కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్‌కు రూ.1600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు ప్రకటించారు.
News September 11, 2025
నా అంచనాలను అందుకొని బెస్ట్ ఇవ్వాలి: CBN

AP: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచనలు, అంచనాలను అందుకొని, ఉత్తమ ప్రదర్శన చేయాలి. CM అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నా. మీరూ అదే పాటించాలి. అన్నింటికి రూల్స్‌తోనే కాకుండా మానవీయ కోణంలోనూ పనిచేయాలి. ఫేక్ ప్రచారాల పెను సవాళ్లను ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ నిర్ణయాలు ఉండాలి’ అని తెలిపారు.
News September 11, 2025
ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వాటిని సరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అందిస్తాం’ అని ట్వీట్ చేశారు.