News October 6, 2025
ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రధానిగా ఫ్రాంకోయిస్ బయ్రూ అవిశ్వాసతీర్మానంలో ఓటింగ్ ద్వారా పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.
Similar News
News October 6, 2025
10 రోజుల ముందు వరకు ఓటర్ లిస్ట్‌లో మార్పులు: CEC

ఓటరు జాబితాలో మార్పులకు నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు అవకాశముందని కేంద్ర ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఫేక్ ఓట్లపై రాజకీయ పార్టీలు కలెక్టర్లకు ఆధారాలు చూపిస్తే తొలగిస్తారని వెల్లడించారు. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.
News October 6, 2025
బిహార్ ఎన్నికలు.. వివరాలు

*మొత్తం ఓటర్లు: 7.43 కోట్లు
*పురుషులు: 3.92 కోట్లు
*మహిళలు: 3.50 కోట్లు
*ట్రాన్స్‌జెండర్లు: 1,725
*85 ఏళ్లు దాటినవారు: 4.04 లక్షలు
*వందేళ్లు పైబడిన ఓటర్లు: 14 వేలు
*మొదటిసారి ఓటు వేసేది: 14.01 లక్షలు
*పోలింగ్ స్టేషన్లు: 90,712
News October 6, 2025
కెప్టెన్‌గా ఎదగాలన్నదే నా లక్ష్యం: జైస్వాల్

టీమ్‌ఇండియాకు ఏదో ఒకరోజు తాను కెప్టెన్ కావాలనుకుంటున్నట్లు యశస్వీ జైస్వాల్ వెల్లడించారు. వన్డే వరల్డ్ కప్ గెలవాలనే కసితోపాటు కెప్టెన్ కావడమూ తన దీర్ఘకాలిక లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతూ నాయకుడిగా ఎదిగేందుకు రోజూ ప్రయత్నిస్తున్నా’ అని తెలిపారు. అయితే గిల్ ఫామ్‌లో ఉన్నంత కాలం జైస్వాల్‌కు కెప్టెన్ అవకాశాలు రావడం తక్కువే. దీనిపై మీ కామెంట్?