News May 17, 2024

‘ఫ్రైడే’.. నో సినిమా డే!

image

శుక్రవారం వచ్చిందంటే చాలు ఏదో ఒక కొత్త సినిమా రిలీజవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యూట్యూబర్లు సైతం క్యూ కడుతుంటారు. సమ్మర్ హాలీడేస్‌లో మరింత కిటకిటలాడాల్సిన థియేటర్లు మూగబోయాయి. పెద్ద హీరోల సినిమా ఒకటీ లేకపోవడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు. దీంతో కొందరు థియేటర్ యజమానులు కొన్నిరోజులు థియేటర్లను మూసివేసేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News January 11, 2025

ఈవీలకు పన్ను రాయితీ

image

AP: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ కొని, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0(2024-2029)ని అమల్లోకి తీసుకొచ్చామని, ఇది ఉన్నంతకాలం ఈవీలపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. హైబ్రిడ్ 4 వీలర్స్‌కు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

News January 11, 2025

JEE అభ్యర్థులకు అలర్ట్

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) మెయిన్-2025 సెషన్-1 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను NTA విడుదల చేసింది. అభ్యర్థులు <>examinationservices.nic.in<<>> వెబ్‌సైట్‌లో తమ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా పేపర్-1 ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లో జరగనుంది. పేపర్-2A, 2B ఈనెల 30న నిర్వహిస్తారు. త్వరలోనే అడ్మిట్ కార్డులను NTA విడుదల చేయనుంది.

News January 11, 2025

15న బైడెన్ ఫేర్‌వెల్ స్పీచ్

image

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈనెల 15న ఆ దేశ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి కాలమానం ప్రకారం రా.8 గంటలకు ఓవల్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఫేర్‌వెల్ స్పీచ్ ఇస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్ పదవీకాలం ఈనెల 20న ముగియనుంది. అదేరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.