News October 15, 2024

స్నేహితుడి హత్య.. సల్మాన్‌కు భద్రత పెంపు

image

రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్‌ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.

Similar News

News January 3, 2025

రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్‌, గిన్నెదారిలో 6.5°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9°C, ADB జిల్లా బేలలో 7.1°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పొగమంచు సైతం ఇబ్బంది పెడుతోంది. మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

News January 3, 2025

రోహిత్ నిర్ణయంపై రవిశాస్త్రి ప్రశంసలు

image

ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్టు నుంచి పక్కకు తప్పుకోవడంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించి రోహిత్ బెంచ్‌కే పరిమితమయ్యారని అన్నారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ తీసుకున్నది గొప్ప నిర్ణయమని చెప్పారు. జట్టు కోసం రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మెచ్చుకున్నారు.

News January 3, 2025

రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?

image

AP: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. PM కిసాన్‌ను ₹6వేల నుంచి కేంద్రం ₹10వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10వేలు కలిపి మొత్తం ₹20వేలు ఇస్తామని CM CBN చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.