News November 14, 2024

భయపెట్టిన క్లాసెన్, జాన్సెన్

image

భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ టీ20 తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ 41(22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), మార్కో జాన్సెన్ 54(17బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్సులతో మొత్తం 22 రన్స్ కొట్టారు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో జాన్సెన్ (4, 6, 4, 2, 6, 4) మొత్తం 26 రన్స్ బాదారు. వీరు ఔటవడంతో భారత్ <<14604651>>గెలిచింది<<>>.

Similar News

News February 14, 2026

మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

image

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News February 14, 2026

టెన్త్ పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

image

సంచలన ఆటతో U19 WC గెలుపులో <<19068083>>కీలక పాత్ర<<>> పోషించిన వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల 17 నుంచి జరిగే CBSE పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ మేరకు అతడికి అడ్మిట్ కార్డు అందజేసినట్లు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్(బిహార్) ప్రిన్సిపల్ నీల్ కిశోర్ సిన్హా తెలిపారు. పరీక్షా హాలులో సాధారణ విద్యార్థి మాదిరే వైభవ్‌నూ చూస్తామని స్పష్టం చేశారు.

News February 14, 2026

OFFICIAL: నిజామాబాద్ కార్పొరేషన్‌లో హంగ్

image

TG: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. అక్కడి 60 డివిజన్లలో బీజేపీ 28, కాంగ్రెస్-17, MIM-14 స్థానాలు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. మేయర్ పీఠం అధిష్ఠించడానికి (మ్యాజిక్ ఫిగర్‌ 31) బీజేపీ 3 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, MIM కలిస్తే మేయర్ పీఠం వారి సొంతమవుతుంది. అటు కొత్తగూడెం, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.