News August 11, 2024

16 నుంచి నామినేటెడ్ పదవుల పండుగ?

image

AP: ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, సంస్థలు ఉండగా 40 వరకు భర్తీ చేయొచ్చని సమాచారం. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఈ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తం పదవుల్లో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం.

Similar News

News April 18, 2026

‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

image

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

News April 18, 2026

సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

image

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.