News October 25, 2024

26 నుంచి సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం

image

TG: నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 26 నుంచి నాగర్ కర్నూలు(D) సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్(M) సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు. నల్లమల అందాలను తిలకిస్తూ ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.

Similar News

News October 25, 2024

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

image

వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం నిర్ణయించేందుకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గడంపై ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.

News October 25, 2024

HYD టు యాదాద్రి.. ఇక MMTS రైలు సర్వీస్

image

HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.

News October 25, 2024

వచ్చే ఏడాదికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం: కిషన్ రెడ్డి

image

TG: కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏటా 600 కోచ్‌లు రూపొందించేలా సిద్ధం చేయనున్నారు. ఇక్కడే గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్‌లు తయారవుతాయి. ఆధునిక LHB కోచ్‌లు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే EMU(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు)లు ఇక్కడే రూపొందిస్తారు. 3వేల మందికి ఉపాధి లభించనుంది. ₹680 కోట్లతో దీనిని చేపడుతున్నామని, 2025 ఆగస్టులోగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.