News May 11, 2024

ఓటు కోసం విదేశాల నుంచి..

image

AP: వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఏపీకి తరలివస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం అత్యంత రద్దీగా మారింది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఓటర్లు ఇక్కడ దిగుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం సొంతూళ్లకు తరలివస్తున్నారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఈసారి ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Similar News

News February 13, 2026

కొడంగల్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌ (వికారాబాద్ జిల్లా)లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. BRS, MIM చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో BRS గెలిచింది.

News February 13, 2026

షాకింగ్.. ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన ఏఐ మోడల్

image

‘రోబో’ మూవీలో సొంతంగా ఆలోచించే చిట్టి(రోబో) సైంటిస్టునే చంపడానికి చూస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి నిజమయ్యే ప్రమాదం ఉంది. స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ వెల్లడించారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని, చంపేందుకూ సిద్ధమైందని తెలిపారు. AIపై నియంత్రణ లేకపోతే ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఇదే నిదర్శనం.

News February 13, 2026

ఒంటరితనంతో ఎన్నో అనారోగ్యాలు

image

ఒంటరితనం అనుభవించేవారిలో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో ఒంటరితనంతో బాధపడుతున్నవారిలో టైప్​ 2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి తగ్గడం, త్వరగా వృద్ధాప్యం రావడం, గుండె జబ్బులు వంటివి ఎక్కువవుతాయంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే క్లోజ్ అనిపించే వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, వీలైనంత ఎక్కువమందితో కమ్యునికేట్ చేయాలని సూచిస్తున్నారు.