News January 16, 2025
సైకిల్‌పై రాకెట్ పరికరాలు తీసుకెళ్లడం నుంచి..!

అంతరిక్ష ప్రయోగంలో భారత్‌కు సాధ్యంకానిది లేదన్నట్లుగా మారిపోతోంది. ఎవరూ చేయని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో.. నేడు SpaDeXను విజయవంతంగా నిర్వహించింది. స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించింది. ఈక్రమంలో టెలికమ్యూనికేషన్ శాఖ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. సైకిల్‌పై రాకెట్ పరికరాలు తీసుకెళ్లడం నుంచి SpaDeX వరకూ జర్నీ అంటూ పోస్ట్ చేసింది.
Similar News
News October 7, 2025
ఎన్నికలు పక్కా.. అయితే ప్లాన్ ‘A’, లేదంటే ‘B’C

TG: ఏదేమైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని CM రేవంత్ స్పష్టం చేశారు. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ జరగనుండగా న్యాయ నిపుణులు, మంత్రులు, ముఖ్య నేతలతో CM సమావేశమయ్యారు. తమ నిర్ణయ ఉద్దేశం, గత తీర్పులను కోర్టుకు వివరించాలని లాయర్లకు సూచించారు. G.O.ను తోసిపుచ్చితే ఆదేశాలు పాటిస్తామని HCకి విన్నవించాలన్నారు. ఇలా అయితే పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో (Plan:B) ఎన్నికలకు వెళ్దామని తెలిపారు.
News October 7, 2025
తప్పుదారి పట్టించేలా ఫేక్ వీడియోలు: నిర్మల

తాను మాట్లాడినట్టుగా రూపొందించిన AI వీడియోలపై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇవి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. ఈ ఫేక్ వీడియోలతో నిజమేదో అబద్ధమేదో తెలీని గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు. వీటిని నివారించేందుకు రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. వ్యక్తుల రూపాలు, స్వరాలను క్లోనింగ్ చేయడానికి AIని వాడుతూ కొందరు మోసాలకు దిగుతున్నారన్నారు.
News October 7, 2025
సిరిమానోత్సవంలో తొక్కిసలాట

AP: విజయనగరం సిరిమానోత్సవంలో తొక్కిసలాట జరిగింది. వేడుక జరుగుతున్న ప్రాంతానికి ఆర్డీవో కీర్తి కారులో రావడంతో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలోనే తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో కీర్తి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.