News February 7, 2025
ఇకపై ఫోన్లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.
Similar News
News December 24, 2025
గోళ్లు పుచ్చిపోయాయా?

ఎక్కువగా నీళ్లల్లో తడవడం, పనిచేయడం వల్ల కాలి గోళ్లు పచ్చబడి, తేలికగా విరిగిపోతుంటే నెయిల్ ఫంగస్ సోకినట్లని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు ఒక ప్లాస్టిక్ టబ్‌లో కలుపుకోవాలి. ఈ నీళ్లలో పాదాలను అరగంట పాటు ఉంచాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పక చేయాలి. ఫంగస్ వదిలి గోళ్లు సాధారణ రంగులోకి వచ్చినా, ఈ చిట్కాను మానేయకుండా మరికొన్ని రోజుల వరకూ కొనసాగించాలి.
News December 24, 2025
వీరికి ఎదుటివారి బాధలు అర్థం కావు!

రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ కంటకాః
తమ స్వభావం, వృత్తి ధర్మాల వల్ల కొందరు ఎదుటివారి బాధలను పట్టించుకోరు. రాజు అధికార గర్వంతో, వేశ్య ధనం కోసం, యముడు ప్రాణాలు తీయడమే విధిగా ఉండటం వల్ల కఠినంగా ఉంటారు. అగ్ని సర్వాన్ని దహిస్తుంది. దొంగ స్వార్థంతో దోచుకుంటాడు. బాలకులు అజ్ఞానంతో, యాచకులు అవసరం కోసం, గ్రామ కరణం(అధికారి) స్వలాభం కోసం ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోరు.
News December 24, 2025
ఫలించిన సునీల్ గవాస్కర్ పోరాటం

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పోరాటం ఫలించింది. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడకూడదంటూ ఢిల్లీ హైకోర్టు నుంచి <<18640617>>పర్సనాలిటీ రైట్స్<<>> పొందిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచారు. గవాస్కర్ పేరు, ఫొటోలను తప్పుగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అనుమతి లేని పోస్టులు, వీడియోలను 72 గంటల్లో తొలగించాలని కోర్టు ఆదేశించింది. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వంటి వారు ఈ రైట్స్ పొందారు.


