News September 20, 2024

ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే!

image

AP: పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. RJD, DEO, MEOల స్థాయిలో మ్యానువల్ ఫైళ్లకు స్వస్తి చెప్పి, ఈ-ఆఫీసు విధానం తీసుకురానుంది. టీచర్లు, విద్యార్థులు, ఖాళీ పోస్టులు, బదిలీలు ఇలా వివరాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి, టీచర్లందరికీ లాగిన్ అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం టీచర్లు వాడుతున్న యాప్స్‌ను తొలగించి, వెబ్‌సైట్‌లోనే అన్నింటినీ ఏర్పాటు చేయనుంది.

Similar News

News October 20, 2025

BDLలో 110 పోస్టులు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 2025-26 సంవత్సరానికి 110 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/

News October 20, 2025

కానిస్టేబుల్ హత్య.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

image

TG: నిజామాబాద్‌లో గత శుక్రవారం కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిన నిందితుడు <<18051417>>రియాజ్‌<<>> ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు AR కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. ఇతడిపై 60కి పైగా కేసులు ఉన్నాయి. సీపీ దీనిపై మీడియాతో మాట్లాడనున్నారు.

News October 20, 2025

ONGCలో 566 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ONGC 566 గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు <>www.iocl.com<<>> వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 31న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు డొమైన్ లాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ‌)పై పరీక్ష ఉంటుంది.