News December 21, 2024
ఇక నుంచి రోజుకు 8-10 సార్లు సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్నెస్ కాలర్ ట్యూన్లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్‌ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.
Similar News
News December 21, 2024
నేటితో ముగియనున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు
TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
News December 21, 2024
స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్‌ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
‘భరణం’ పేరిట భర్తను భార్య దోచుకోకూడదు: సుప్రీం
భరణమనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంది. భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్గా రూ.12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.