News September 22, 2024
ఇక నుంచి రోజుకి ₹100, నెలకు ₹250 కూడా పెట్టుబడి పెట్టొచ్చు
చిన్నమొత్తంలో పెట్టుబడి పెట్టేవారిని ప్రోత్సహించేలా మ్యూచువల్ ఫండ్స్‌లో మైక్రో-SIPలను తీసుకురావడానికి సెబీ కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా ఇక నుంచి రోజుకు రూ.300 కాకుండా రూ.100 కూడా పెట్టుబడిగా పెట్టొచ్చు. అలాగే నెలకు రూ.వెయ్యికి బదులుగా రూ.250, మూణ్నెళ్లకు రూ.3 వేలకు బదులుగా రూ.750 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అక్టోబర్ మొదటివారంలో LIC MF అలాంటి ప్లాన్ ప్రారంభించనుంది.
Similar News
News October 15, 2024
అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు
1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
1994: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం
News October 15, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 15, 2024
హీరో దర్శన్‌కు మరోసారి చుక్కెదురు
కన్నడ హీరో దర్శన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. కాగా దర్శన్‌ను బళ్లారి జైలు నుంచి బెంగళూరు జైలుకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెంగళూరులో చికిత్స అందించాలని దర్శన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.