News April 10, 2025

నేటి నుంచి బీజేపీ ‘గావ్ చలో.. బస్తీ చలో’

image

TG: ప్రజల్లో వక్ఫ్ సవరణలపై అవగాహన కల్పించేందుకు గాను బీజేపీ నేటి నుంచి 12వ తేదీ వరకు ‘గావ్ చలో.. బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తాము చేసిన సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాల్ని నేతలు ప్రజల్లో తిరిగి వివరించనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే. లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇందులో భాగస్వాములు కానున్నారు.

Similar News

News September 14, 2025

6 పరుగులకే 2 వికెట్లు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.

News September 14, 2025

BREAKING: భారత్ ఓటమి

image

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.

News September 14, 2025

రూ.153 కోట్లతో USలో ఇల్లు కొన్న అంబానీ

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. న్యూయార్క్‌లోని ఈ ఇంటి విలువ $17.4 మిలియన్లు (రూ.153 కోట్లు) అని పేర్కొంది. గత పదేళ్లుగా అది ఖాళీగా ఉందని తెలిపింది. 2018లో రాబర్ట్ పేరా $20 మిలియన్లకు దీన్ని కొనుగోలు చేశారు. 20వేల స్క్వేర్ ఫీట్ల ఈ భారీ భవంతిలో 7 బెడ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, 5వేల స్క్వేర్ ఫీట్ల ఔట్ డోర్ స్పేస్ ఉన్నాయి.