News April 15, 2025

నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. ప్రస్తుతం 250కిపైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500 సేవలకు విస్తరించనుంది.

Similar News

News January 7, 2026

భారత్ ఘన విజయం

image

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.

News January 7, 2026

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్లాస్టిక్ బకెట్లే వాడాలి. ఇనుప బకెట్లు వద్దు. నీటిలో హీటర్ పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి. హీట్ అవుతున్నప్పుడు నీళ్లను, బకెట్‌ను తాకకూడదు. నీళ్లు వేడయ్యాక స్విచ్ఛాఫ్ చేశాకే రాడ్ తీసేయాలి’ అని చెబుతున్నారు. తాజాగా UP ముజఫర్‌నగర్‌లో లక్ష్మి(19), నిధి(21) అనే అక్కాచెల్లెలు హీటర్ రాడ్ తగిలి విద్యుత్ షాక్‌తో చనిపోయారు.

News January 7, 2026

విక్కీ కౌశల్ కొడుకు పేరు.. ‘Uri’ మూవీతో లింక్!

image

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు గతేడాది నవంబర్ 7న <<18223859>>మగబిడ్డకు<<>> జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ తమ కొడుక్కి విహాన్ కౌశల్ అని పేరు పెట్టినట్లు వారు వెల్లడించారు. అయితే ఈ పేరుకు ‘Uri: The Surgical Strike’ మూవీతో లింక్ ఉండటం గమనార్హం. 2019 జనవరి 11న రిలీజైన ఈ చిత్రంలో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రను విక్కీ పోషించారు. దానికి గుర్తుగానే విహాన్‌గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.