News August 22, 2024
నేటి నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్

AP: డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. 29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి SEP 3వ తేదీ లోపు కాలేజీల్లో చేరాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి.
Similar News
News November 23, 2025
చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.
News November 23, 2025
రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

<<18323509>>ఎన్కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.


