News July 3, 2024
విషాదం నుంచి విజయానికి!

కేరళకు చెందిన జాతీయ స్థాయి స్విమ్మర్ షాన్ ఎస్ ఎన్నో విషాదాలను తట్టుకొని విజయాన్ని ముద్దాడారు. 2013లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోవడంతో అతని జీవితం తలకిందులైంది. అయినా క్రీడల పట్ల తనకున్న అభిరుచిని కోల్పోలేదు. కాళ్లు లేకపోయినా కష్టపడి స్విమ్మింగ్ నేర్చుకుని జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అధిరోహించేందుకు సిద్ధమవుతూ ఎందరికో ప్రేరణనిస్తున్నారు.
Similar News
News March 12, 2026
సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.
News March 12, 2026
మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
News March 12, 2026
ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


