News May 3, 2024
అమ్మ పోటీ చేసిన స్థానం నుంచే – 2/2

ఈ సీటుకు రెండు టర్మ్‌లు ప్రాతినిధ్యం వహించిన సతీశ్ శర్మ 1998లో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేసి మళ్లీ అమేథీని తిరిగి కాంగ్రెస్ వశం చేశారు. 2004లో ఆ సీటును రాహుల్ గాంధీకి అప్పగించి రాయ్‌బరేలీకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత రాహుల్ అమేథీ నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు రాహుల్ రాయ్‌బరేలీలో నిలిచారు. రాహుల్‌కు ముందు ఈ రెండు స్థానాల్లోనూ సోనియా పోటీ చేయడం గమనార్హం. <<-se>>#Elections2024<<>>
Similar News
News October 27, 2025
11AMకు లక్కీ డ్రా.. అదృష్టం ఎవరిని వరించేనో?

TG: మద్యం షాపులకు ఇవాళ 11AMకు అన్ని జిల్లాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్లు లక్కీ డ్రా తీయనున్నారు. 2,620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు ఉన్నప్పటికీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్క షాపు తగిలినా లైఫ్ సెట్ అవుతుందనే ఉద్దేశంతో పలువురు పదుల సంఖ్యలో అప్లికేషన్స్ పెట్టారు. మరి ఎవరి లక్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీరూ అప్లై చేశారా?
News October 27, 2025
గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News October 27, 2025
నేల లోపల గట్టి పొరలుంటే ఏమి చేయాలి?

కొన్ని నేలల్లో లోపల గట్టి పొరల వల్ల సాగు సమస్యగా మారి దిగుబడి ఆశించినంతగా రాదు. ఇలాంటి భూముల్లో ఉపరితలం నుంచి మీటరు వెడల్పున గుంత తవ్వుతూ వెళ్తే కొంత లోతున గట్టి పొరలు కనబడతాయి. గట్టి పొరకు పైన, కింద మామూలు మట్టి ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో పెద్ద ట్రాక్టరుతో లోతు దుక్కులు చేసుకోవాలి. దీంతో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 2 టన్నుల జిప్సం వేస్తే 10 నుంచి 12 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.


