News November 10, 2024
కర్మ ఫలం ఎవరినీ వదిలిపెట్టదు: పవన్ కళ్యాణ్

AP: ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమని Dy.CM పవన్ అన్నారు. కానీ పరిమితులు దాటి కుటుంబాలు, కుల మతాలు, దేవతలను దూషించడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు. దేహబలం, డబ్బు, క్రిమినల్స్ సపోర్ట్ ఉందని బెదిరిస్తే, భయపడటానికి ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని సోషల్ మీడియా దుర్వినియోగదారులు ఇతరులను తిట్టేముందు 100సార్లు ఆలోచించుకోవాలన్నారు. కర్మ ఫలం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.
Similar News
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.
News November 13, 2025
రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.
News November 13, 2025
TG TET షెడ్యూల్ విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.


