News April 21, 2024
ఫ్రూట్ విలేజ్.. ఏడాదికి రూ.50కోట్ల ఆదాయం!

మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ గ్రామం ‘ఫ్రూట్ విలేజ్’గా ప్రభుత్వ గుర్తింపు పొందింది. 250 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఒకప్పుడు గోధుమలు, జొన్నలు సాగు చేసేవారు. పంటలు సరిగా పండకపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి, సీజన్‌ను బట్టి 20 రకాల పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.40-50కోట్ల ఆదాయం పొందుతున్నారు. దీంతో ఇక్కడి యువ రైతులకు పిల్లనివ్వడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతున్నారట.
Similar News
News February 2, 2026
USAపై భారత్-A విజయం

T20WC వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అమెరికా చివరి వరకు పోరాడి 200కు ఆలౌటైంది. ఆ జట్టులోని ఆండ్రిస్ 44, సంజయ్ 41, శుభమ్ 28, హర్మీత్ 25, మిలింద్ 18, మోహ్సిన్ 21 రన్స్ చేశారు. రవి బిష్ణోయ్ 3, ఖలీల్, నమన్ చెరో 2 వికెట్లు, తిలక్, అశోక్, బదోనీ తలో వికెట్ తీశారు. కాగా USA జట్టులోని మెజార్టీ ప్లేయర్లు భారత సంతతికి చెందినవారే.
News February 2, 2026
VASTHU: ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలు వద్దు!

ఇంటి ప్రాంగణంలో కొన్ని రకాల చెట్లు ఉండటం అశుభమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పాలు కారే చెట్లు ఉండొద్దు. ఇవి ధన నష్టానికి కారణమవుతాయి. ముళ్లున్న మొక్కలు శత్రుత్వానికి దారితీస్తాయని అంటారు. ఇంటికి అతి సమీపంలో నీడ పడేలా ఉండే పెద్ద చెట్లు, ఊడలు దిగే మర్రి, రావి చెట్లు పునాదులకు, వంశాభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. ఎండిపోయిన, కుళ్లిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 2, 2026
బ్రాండ్లు వేరైనా.. యజమాని ఒక్కరే

మార్కెట్‌లో వేర్వేరు బ్రాండ్ల మధ్య పోటీ ఉందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు మన డబ్బు ఒకే సంస్థ జేబులోకి వెళ్తుంది. దీన్నే మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. ఉదాహరణకు అప్సర, నటరాజ్.. రెండు పెన్సిల్స్ ఒకే సంస్థవి. లక్స్, లైఫ్‌బాయ్ సబ్బులు కూడా హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థకు చెందినవి. ఆడి, స్కోడా కార్లు వోక్స్‌వ్యాగన్ గ్రూపువి. ప్రతి రకమైన కస్టమర్‌ను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఈ స్ట్రాటజీని వాడుతాయి.


