News August 24, 2024
FTL, బఫర్‌జోన్ అంటే ఏంటి?

చెరువు, జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం పరిధిని <<13929013>>FTL<<>>(ఫుల్ ట్యాంక్ లెవల్) అంటారు. కొన్ని దశాబ్దాల పాటు వాటికి వచ్చిన వరదను బట్టి FTLను నిర్ధారిస్తారు. ఇక నీటి వనరును బట్టి బఫర్‌జోన్‌ను నిర్ధారిస్తారు. 25 హెక్టార్లు, అంతకుమించి విస్తీర్ణంలో చెరువు, రిజర్వాయర్లు ఉంటే బఫర్ జోన్ నిర్ధారణకు 30 మీ.(100 ఫీట్లు)ను ప్రామాణికంగా తీసుకుంటారు. వీటి పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సాగు చేసుకోవచ్చు.
Similar News
News April 25, 2025
టెర్రరిస్ట్-మిలిటెంట్.. ఏంటి తేడా?

విశ్లేషకుల ప్రకారం.. హింసతో సమాజంలో భయం కల్గించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికస్థితి తదితరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం (టెర్రరిజం). దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. సామాజిక, రాజకీయ లక్ష్యాలతో హింసకు పాల్పడేవారు తీవ్రవాదులు (మిలిటెంట్స్). రెండూ హింస మార్గాలే, కానీ ఉద్దేశాలు వేరు. పహల్గాం దాడి ‘మిలిటెంట్ అటాక్’ అన్న <<16207620>>NYTపై<<>> USA ప్రభుత్వం ‘ఇది టెర్రరిస్ట్ అటాక్’ అని కౌంటరిచ్చింది.
News April 25, 2025
BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, BRS దూరంగా ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో నిలిచాయి. మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు పోలయ్యాయి.
News April 25, 2025
చదివి గెలిచింది.. కానీ అనారోగ్యం కబళించింది

AP: నంద్యాల జిల్లా దొర్నిపాడులో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. జెడ్పీ హైస్కూల్‌లో చదివి 557 మార్కులు సాధించిన సారా అనే బాలిక ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీనే మరణించింది. చనిపోయే ముందు కూడా తనకు 500పైనే మార్కులొస్తాయని చెప్పిందంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.