News August 19, 2024
వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్?

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కారు వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. ఈమేరకు కసరత్తు చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశం కానుందని తెలిపాయి. నెలాఖరులోపు బడ్జెట్ అంచనాలను పంపించాలని అన్ని శాఖలకు సూచించిందని వెల్లడించాయి.
Similar News
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఇలా కూడా తెలుసుకోవచ్చు

ఆన్లైన్లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్‌కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ గడువు పెంపు

TG: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు అందించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును NOV 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది. ఫ్రెష్, రెన్యూవల్ రెండింటికీ ఇది వర్తిస్తుంది. 2025 ఇంటర్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కాలర్షిప్ పొందినవారు 2025-26 విద్యాసంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవచ్చు. సైట్: scholarships.gov.in