News June 14, 2024

జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్‌?

image

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 9 వరకు కొనసాగనున్నాయట. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Similar News

News October 16, 2025

టీచర్లకు టెట్.. ప్రభుత్వం సమాలోచనలు!

image

AP: టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని SEP 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపైనా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కాగా 2011కు ముందు టెట్ లేదు.

News October 16, 2025

సృష్టిలో శివ-శక్తి స్వరూపం

image

శివలింగాలు ప్రధానంగా 2 రకాలు. అవి స్థావరలింగం, జంగమ లింగం. చెట్లు, లతలు స్థావర లింగాలు కాగా, క్రిమి కీటకాదులు జంగమ లింగాలు. స్థావర లింగాన్ని నీరు పోసి సంతోషపెట్టాలి. జంగమ లింగాన్ని ఆహార వస్తువులతో తృప్తిపరచాలి. ఇదే నిజమైన శివ పూజ. సర్వత్రా ఉన్న పీఠం దేవి స్వరూపం. లింగం సాక్షాత్తూ చిన్మయ స్వరూపం. ఇలా సృష్టిలోని ప్రతి అంశంలోనూ శివ-శక్తి స్వరూపాన్ని గుర్తించి, సేవించడమే ఉత్తమ పూజా విధానం. <<-se>>#SIVOHAM<<>>

News October 16, 2025

రాష్ట్రంలో 218 పోస్టులు… అప్లై చేశారా?

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌ 218 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 97 ఉండగా, ఫ్యాకల్టీ పోస్టులు 121 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 26 దరఖాస్తుకు ఆఖరు తేదీ. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/