News August 4, 2024
9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 965 కి.మీ మైలేజీ!

విద్యుత్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్, మైలేజీ అతి పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. వీటి వలన ప్రజలు ఈవీలవైపు మొగ్గుచూపడం లేదు. సాంసంగ్ సంస్థ 2027 కల్లా దీనికి పరిష్కారాన్ని తీసుకొచ్చేందుకు చూస్తోంది. కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయి 965 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బ్యాటరీని సంస్థ తయారుచేసింది. ఏ వాహనంలోనైనా దీన్ని వాడుకోవచ్చని 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని చెబుతోంది. అయితే, ఎక్కువ ధర ఉండనుందని సమాచారం.
Similar News
News January 27, 2026
భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు

ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక<<18969639>> ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్<<>> (FTA) ఖరారు కావడంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. EU కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించామని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గొప్పలు చెప్పుకున్నారు. ఉక్రెయిన్ కోసం తాము రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై టారిఫ్‌లు విధిస్తే, EU మాత్రం ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు.
News January 27, 2026
హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

లాస్ఏంజెలిస్(US)లోని హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.
News January 27, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


