News August 15, 2025
సరదా సన్నివేశం: ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’

AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభోత్సవంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు బస్సులో వెళ్లారు. ‘విజయవాడకు మూడు టికెట్లు ఇవ్వండి’ అని పవన్ కండక్టర్‌ను అడిగారు. అక్కడే ఉన్న లోకేశ్ ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’ అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.
Similar News
News August 16, 2025
మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా అక్కడ బంద్‌కు పిలుపు

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఈ నేపథ్యంలో AUG 18న రంగారెడ్డి(D) ఆమనగల్లు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లోకల్ వ్యాపారులు ప్రకటించారు.
News August 15, 2025
PHOTO GALLERY: రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’

AP: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందులో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
News August 15, 2025
ట్రంప్, పుతిన్ మధ్య కనీసం 6-7గంటలు చర్చలు!

అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ కాసేపట్లో అలాస్కా వేదికగా భేటీ కానున్నారు. వీరి మధ్య కనీసం 6-7గంటల పాటు వివిధ అంశాలపై చర్చ జరగనున్నట్లు రష్యా అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఇరుదేశాధినేతల మధ్య ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించే చర్చ జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.