News November 5, 2024
FUN: ఎవరూ చెప్పని, ఎక్కడా రాయని కొన్ని రూల్స్!

* సోషల్ మీడియాలో సోదరితో ఫొటోను అప్లోడ్ చేస్తే ఆమె మీ సోదరి అని క్యాప్షన్లో రాయాలి.
* ఇంటిముందు చెప్పులు తలకిందులుగా ఉంటే మనం ఎంత బిజీగా ఉన్నా వాటిని సరిచేయాలి.
* నాన్న గదిలోకి రాగానే ఫోన్ను దాచిపెట్టి, ఫోన్ వాడనట్లు నటించాలి.
* మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నా నవ్వు ఆపుకోవాలి.
* మెట్రో, రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో రిక్షాలను చూడనట్లు నటించాలి.
Similar News
News December 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 84

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, ఓ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు. ఆయన ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 2, 2025
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP: తూర్పుగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు గల మహిళలు ఈనెల 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏడో తరగతి, టెన్త్ , డిగ్రీ, పీజీ (సైకాలజీ డిప్లొమా/ సైకియాట్రీ/ న్యూరోసైన్సెస్/ LLB/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ పబ్లిక్ హెల్త్/ MSW), బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: eastgodavari.ap.gov.in
News December 2, 2025
పురుగుల బెడద తగ్గించే లింగాకర్షక బుట్టలు

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.


