News August 28, 2024

జగన్ వల్లే పోలవరానికి నిధులు: అంబటి

image

AP: సీఎంగా ఉన్న టైంలో జగన్ చేసిన కృషి వల్లే ఇప్పుడు పోలవరానికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కానీ ఈ క్రెడిట్ తనదే అన్నట్లు సీఎం చంద్రబాబు ప్రసంగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ‘పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే కుట్రలు చేస్తున్నారు. వైసీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

Similar News

News October 15, 2025

పత్తి దిగుబడి పెరగాలంటే..

image

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.

News October 15, 2025

₹13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

image

AP: PM మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ₹13వేల కోట్ల పనులలో కొన్నింటిని పీఎం ప్రారంభిస్తారని, మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారని CM CBN తెలిపారు. ‘గత పాలకుల తప్పిదాలతో రాష్ట్రం చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దేందుకే చాలా టైం పట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులొస్తున్నాయి. కూటమితో APని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుదాం. PM సభను విజయవంతం చేయాలి’ అని కోరారు.

News October 15, 2025

హిందీ మూవీస్‌ బ్యాన్‌కు TN ప్రభుత్వం బిల్లు!

image

తమిళనాడులో హిందీ ఇంపోజిషన్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ మూవీస్, సాంగ్స్, హోర్డింగ్స్‌ను బ్యాన్ చేసేందుకు ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయంలో చట్టపరమైన సవాళ్లపై నిన్న రాత్రి సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఇది మూర్ఖత్వమని బీజేపీ నేత వినోజ్ సెల్వమ్ మండిపడ్డారు.