News September 9, 2024

నేడు ‘నేతన్నకు చేయూత’ నిధులు విడుదల

image

TG: నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ నేడు విడుదల చేయనున్నారు. దీంతో 36,133 మంది అర్హులు లబ్ధిపొందనున్నారు. IIHT ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన నిధులు విడుదల చేస్తారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ పథకం రెండో విడత 2021 సెప్టెంబర్‌లో మొదలై 2024 ఆగస్టుతో ముగిసింది. రికరింగ్ అకౌంట్లలో కార్మికులు జీతంలోని 8% జమ చేస్తే ప్రభుత్వం దాదాపు రెట్టింపు ఇచ్చి మొత్తాన్ని మూడేళ్ల తర్వాత అందిస్తోంది.

Similar News

News September 17, 2025

అమరావతిలో క్వాంటం వ్యాలీ.. ఆకృతి ఇదే!

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. నిన్న కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించిన కట్టడాల ఆకృతినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాలీ కోసం 50ఎకరాలు కేటాయించగా, ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతి(A)లో నిర్మించనున్నట్లు సమాచారం. సాధారణంగానే పునాదులు నిర్మించి, మిగిలిన కట్టడాన్ని ప్రీ ఇంజినీరింగ్ సాంకేతికతతో వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News September 17, 2025

76వ వసంతంలోకి ప్రధాని మోదీ

image

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేడు 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఓ సాధారణ కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానిగా ఎదిగారు. గుజరాత్‌కు 13 ఏళ్లు సీఎంగా చేశారు. 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రశంసలతో పాటు విమర్శలనూ ఎదుర్కొన్నారు. ప్రధానిగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. Happy Birthday PM Narendra Modi.

News September 17, 2025

ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

image

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అటు TGలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు పడే ఛాన్సుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.