News April 7, 2025

ఉత్తరాదికి నిధులు.. దక్షిణాదికి మోసం: కోదండరాం

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని MLC కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. HYDలో ఈ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూళ్లలో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తోందన్నారు.

Similar News

News October 14, 2025

WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

image

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్‌నెస్‌తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News October 14, 2025

ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

image

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2025

మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

image

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.