News October 25, 2025
పశుగ్రాస విత్తనాలు, పశుగణ బీమాకు నిధులు విడుదల

AP: పశుగణ బీమా, నాణ్యమైన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్(NLM) కింద ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 25, 2025
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.
News October 25, 2025
వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ సవరణ!

దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వచ్చే వారం నుంచి EC చేపట్టనుంది. తొలి దశలో 10-15 రాష్ట్రాల్లో ప్రారంభించనుందని తెలుస్తోంది. 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముందుగా SIR చేపట్టనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు జరుగుతున్న, త్వరలో జరిగే రాష్ట్రాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించనుంది. కాగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో 2026లో ఎన్నికలు జరగనున్నాయి.
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. సోనూసూద్ రిక్వెస్ట్

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో నటుడు సోనూసూద్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్‌ది పెట్టాలి. ఆపరేటర్లకు నెల సమయం ఇవ్వండి. పర్మిట్ రెన్యూవల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్లు ఫొటోలు అప్‌లోడ్ చేయాలని చెప్పండి. నితిన్ గడ్కరీ సార్ చర్యలు తీసుకోండి. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి’ అని ట్వీట్ చేశారు.


