News September 13, 2024
నిబంధనలు పెట్టకుండా నిధులివ్వండి: రేవంత్

TG: రాష్ట్రంలో సంభవించిన వరదల నష్టానికి ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సెక్రటేరియట్లో ఆయన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి, నిధి ఏర్పాటు చేయాలన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర అంశాలను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
Similar News
News December 22, 2025
నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.
News December 22, 2025
డిసెంబర్ 22: చరిత్రలో ఈ రోజు

✒ 1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (ఫొటోలో)
✒ 1899: ప్రముఖ వైద్యుడు శొంఠి దక్షిణామూర్తి జననం
✒ 1953: సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటు
✒ 2000: ఢిల్లీలోని ఎర్రకోటలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక పౌరుడిని హతమార్చారు
✒ 2015: నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ మరణం
✒ జాతీయ గణిత దినోత్సవం
News December 22, 2025
రికార్డు సృష్టించిన స్మృతి

టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. మహిళల T20Iల్లో 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఏషియన్ ప్లేయర్గా నిలిచారు. 154 మ్యాచుల్లో 4,007 రన్స్ చేశారు. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 రన్స్తో తొలి స్థానంలో ఉన్నారు.


