News October 9, 2025
కోర్టు కాపీ అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ: పొన్నం

TG: బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోర్టు కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు ఇంప్లీడ్ కాలేదో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
Similar News
News October 9, 2025
AP న్యూస్ రౌండప్

* రేపు నెల్లూరు(D)లో CM చంద్రబాబు పర్యటన.. విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూల్ ప్రారంభం
* కల్తీ మద్యంపై CBI విచారణ జరపాలి: MP మిథున్ రెడ్డి
* మెడికల్ కాలేజీలకు జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదు: అచ్చెన్న
* పర్మిషన్‌లో రూటు మార్చినా జగన్ రూటే సెపరేటు: అంబటి
* మైనారిటీ యువతకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలకు 13న విజయవాడలో ఎంపిక ఇంటర్వ్యూలు.. సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి ఫరూక్
News October 9, 2025
ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకుంటే.. నార్వే భవిష్యతేంటి?

2025కు గాను నోబెల్ శాంతి బహుమతిని రేపు ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ విజేతను డిసైడ్ చేయనుంది. దీంతో నార్వే నేతలు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయకపోతే ఆ ప్రభావం US-నార్వే రిలేషన్స్‌పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. చైనా, భారత్ వంటి అగ్రదేశాలనే లెక్కచేయని ట్రంప్ తమపై కఠిన చర్యలు తీసుకునే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.
News October 9, 2025
ఎలక్షన్ నోటిఫికేషన్ నిలిపివేత

TG: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ SEC ప్రకటన విడుదల చేసింది. BC రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల GO-9ను జారీ చేసింది. దీని ప్రకారమే SEC షెడ్యూల్ ప్రకటించి, ఇవాళ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే GO-9 చెల్లదంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.