News August 4, 2024
భావితరాలు సంప్రదాయాలను కొనసాగించాలి: మంత్రి అనిత

AP: నేతన్నల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో నిర్వహించిన శారీ వాక్‌లో ఆమె పాల్గొన్నారు. భారతదేశం అంటే గుర్తొచ్చేది చీరకట్టు సంప్రదాయం అని అన్నారు. చీరలో అమ్మతనం, కమ్మదనం ఉంటుందని మంత్రి తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. సుమారు 8 వేల మంది యువతులు, మహిళలు ఈ శారీ వాక్‌లో పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఆస్తా పూనియా

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరర్‌కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్ స్ట్రీమ్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్‌మోడల్‌గా నిలిచింది.
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.
News December 4, 2025
ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.


