News August 9, 2024
తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ ట్యాగ్‌లైన్: సీఎం రేవంత్

తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్‌లైన్‌తో పిలవాలని CM రేవంత్ అన్నారు. కాలిఫోర్నియాలో AI బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ‘AI హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్‌కు TG పర్యాయపదంగా నిలుస్తుంది. అందరం కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అని టెక్ యూనికార్న్ CEOలను ఆహ్వానించారు. బయోటెక్ కంపెనీ ‘Amgen’ HYDలో కొత్త సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Similar News
News October 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 29, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 29, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 29, 2025
తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.


