News October 3, 2024
చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు: రేవంత్

TG: యువత డ్రగ్స్ జోలికి వెళ్తే ఏమి సాధించలేరని సీఎం రేవంత్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దానికి సిరాజ్, నిఖత్ జరీన్, మాలవత్ పూర్ణ నిదర్శనమన్నారు. రాష్ట్ర అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 2028 ఒలింపిక్స్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించాలన్నారు.
Similar News
News November 7, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్(ఫీచర్ ఫిల్మ్)గా ‘కమిటీ కుర్రాళ్లు’ డైరెక్టర్ యధు వంశీ నామినేట్
☛ DEC 25న థియేటర్లలోకి మోహన్లాల్ ‘వృషభ’ మూవీ
☛ ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ నుంచి అనుష్క శెట్టి లుక్ రివీల్. రోజిన్ థామస్ దర్శకుడు. ప్రధాన పాత్రలో మలయాళ నటుడు జయసూర్య
☛ TV యాడ్ కోసం సచిన్ టెండూల్కర్ను డైరెక్ట్ చేసిన ‘OG’ డైరెక్టర్ సుజీత్
News November 7, 2025
పెళ్లి ఏర్పాట్లలో రష్మిక!

విజయ్ దేవరకొండతో రష్మిక మంధాన వచ్చే ఏడాది వివాహ <<18217983>>బంధంలోకి <<>>అడుగు పెట్టనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్ జైపూర్(రాజస్థాన్)లో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సరైన వేదిక కోసం రష్మిక 3 రోజులు అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. జైపూర్లోని పలు రిసార్టులను పరిశీలించారని టాక్. త్వరలోనే వేదికను ఖరారు చేయనున్నట్లు సినీ వర్గాల ప్రచారం.
News November 7, 2025
అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం

AP: నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు.


