News January 31, 2025

FY26 GDP అంచనా 6.3-6.8%: ఆర్థిక సర్వే

image

FY26లో భారత GDP వృద్ధిరేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రాబోయే ఏడాదిలో వృద్ధి దూకుడుగా ఉండదని సంకేతాలు ఇచ్చింది. IMF అంచనాకు దగ్గరగానే ఇచ్చింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, విదేశీ ఖాతా పటిష్ఠంగా ఉందని వెల్లడించింది. ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుందని, త్వరలోనే RBI టార్గెట్ అయిన 4 శాతానికి దిగొస్తుందని పేర్కొంది. ఇందుకు సరైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.

Similar News

News February 14, 2026

కూలి కూటికిరాదు, లేకి చేతికిరాదు

image

వ్యవసాయం, వ్యాపారం ఏదైనా అన్ని పనులకూ కూలీల మీదే ఆధారపడితే చేతికి వచ్చే లాభం కూలీలకే సరిపోతుంది. యజమానికి కనీసం తిండికి కూడా మిగలదు. అందుకే సాధ్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకోవాలి. అలాగే ఇతరులకు పని అప్పగించేటప్పుడు నిర్లక్ష్యం, బాధ్యత లేనివారికి అప్పగిస్తే, ఆ పని పూర్తికాదు సరికదా, ఆశించిన ఫలితం మన చేతికి అందదు. అందుకే పని అప్పగించినా మన పర్యవేక్షణ తప్పక ఉండాలని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 14, 2026

‘వీరు ఉపవాసం ఉండకపోవడం ఉత్తమం’

image

భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు ఆరోగ్యం దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండటం మేలు. మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కఠిన ఉపవాసం చేయకూడదంటున్నారు డాక్టర్లు. ‘శారీరక ఇబ్బందులున్న మహిళలు ఉపవాసం మానేయవచ్చు. ఆహారం తీసుకుంటూ శివ నామస్మరణ, ధ్యానం చేస్తే అంతటి సమానమైన పుణ్యం లభిస్తుంది’ అని పండితులు సూచిస్తున్నారు.

News February 14, 2026

మున్సిపల్ ఫలితాలు.. బీజేపీ ‘సున్నా’

image

TG: 116 మున్సిపాలిటీల్లో BJP ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఏకంగా 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డూ సొంతం చేసుకోలేదు. ఉమ్మడి వరంగల్, MBNR, ఖమ్మం, NLG జిల్లాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 3 మున్సిపాలిటీల్లో (ఆదిలాబాద్, మెట్‌పల్లి, నారాయణపేట్) మాత్రమే మిగతా పార్టీల కంటే ఎక్కువ వార్డులు గెలుచుకుంది. అయితే బండి సంజయ్ ఒంటరి ప్రచారం తన పార్లమెంటు పరిధిలోని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కట్టబెట్టింది.