News September 3, 2024

‘గబ్బర్ సింగ్’ ALL TIME RECORD

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఒక్కరోజులోనే ఈ సినిమాకు రూ.7.2 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ రీరిలీజ్ మూవీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నాయి. ఇప్పటివరకూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘మురారి’ సినిమా తొలిరోజు రూ.5.45 కోట్లు కలెక్ట్ చేయగా దీనిని బీట్ చేసిందని తెలిపాయి.

Similar News

News February 3, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఎప్పుడుదప్పులు వెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివసించే కప్ప బతుకు ఎంత అస్థిరంగా ఉంటుందో ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది.

News February 3, 2025

వచ్చే వారం 4 ఐపీవోలు

image

మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఈ నెల 4-10వ తేదీల మధ్య నాలుగు కంపెనీలు IPOకు రానున్నాయి. ఎలిగాంజ్ ఇంటీరియర్స్ రూ.78.07 కోట్లు, అమ్విల్ హెల్త్ కేర్ రూ.59.98 కోట్లు, రెడ్‌మిక్స్ కన్‌స్ట్రక్షన్ రూ.37.66 కోట్లు, చాముండా ఎలక్ట్రానిక్స్ రూ.14.60 కోట్లు సేకరించనున్నాయి. అలాగే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్, మల్పాని పైప్స్ కంపెనీలు లిస్ట్ కానున్నాయి.

News February 3, 2025

జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి మోదీ.. జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు

image

సుప్రీంకోర్టు మాజీ CJI జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో PM మోదీ పాల్గొనడంపై జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయన్నారు. మీడియా కవరేజ్ లేకుండా కార్యక్రమం జరిగి ఉంటే ఆందోళన రేకెత్తేది కాదని చెప్పారు. చంద్రచూడ్ నిజాయితీపరుడని, కోర్టు వ్యవహారాలపై PMతో ఎప్పుడూ చర్చించలేదని పేర్కొన్నారు. కాగా జస్టిస్ రాయ్ నిన్న పదవీ విరమణ చేశారు.