News July 17, 2024
‘గబ్బర్సింగ్’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్సింగ్’ మూవీ రీరిలీజ్ కానుంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ 2012 మే 11న విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది.
Similar News
News December 18, 2025
తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన

CEC జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శ్రీశైలం వెళతారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 21న HYD రవీంద్ర భారతి ఆడిటోరియంలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. కాగా ఈ పర్యటనలో ఆయన గోల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
News December 18, 2025
హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు NHAI టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా రోడ్డు పక్కన QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు-నెలమంగళ (NH-48), బెంగళూరు-కోలార్-ముల్బాగల్ (NH-75) మార్గాల్లో అందుబాటులోకి తెచ్చింది. QR కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ వివరాలు, దగ్గరున్న టోల్ & ఫీజు, సౌకర్యాలు & అత్యవసర సేవల గురించి తెలుస్తుంది.
News December 18, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ.25వేలు: గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిని ‘రాహ్వీర్’(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి ₹25వేలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు ₹1.5 లక్షలు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.


