News January 18, 2025

ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం: భట్టి

image

TG: ఉగాది సందర్భంగా గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీతో మీటింగ్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. సినీ ఇండస్ట్రీ వాళ్లు అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామన్నారు. మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని భట్టి స్పష్టం చేశారు.

Similar News

News January 19, 2026

మహిళల స్వావలంబనకే ప్రభుత్వ ప్రాధాన్యం: అడ్లూరి

image

మహిళల ఆర్థిక స్వావలంబనకే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూ కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

News January 19, 2026

ఇండియన్ క్రికెట్‌లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

image

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్‌గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్‌లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

News January 19, 2026

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

image

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్‌సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.