News April 22, 2025
జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రదానం: దిల్ రాజు

TG: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని TGFDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. HICC వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలను ఎంకరేజ్ చేస్తామన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటలతో గద్దర్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.
Similar News
News April 22, 2025
తప్పడం తప్పు కాదు.. తొందరపడొద్దు..!

ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో పాసై కాలర్ ఎగరేయండి. All The Best
News April 22, 2025
ఆరోగ్యం కోసం ఈ 5 మొక్కలు ఇంట్లో నాటండి!

కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ 5 మొక్కలు మీ ఇంట్లో గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
*కలబంద- స్కిన్ హెల్త్, జుట్టు పెరుగుదల.
*తులసి- ఇమ్యూనిటీ బూస్టర్, దగ్గు, జలుబును తగ్గిస్తుంది.
*తిప్పతీగ- ఇమ్యూనిటీ బూస్టర్, బాడీని డీటాక్సిఫై చేస్తుంది.
*అశ్వగంధ- ఇమ్యూనిటీ బూస్టర్, ఒత్తిడి తగ్గిస్తుంది.
*స్నేక్ ప్లాంట్- నైట్ ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
News April 22, 2025
మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వ్యాల్యుయేషన్ జరిగిందని బోర్డు పేర్కొంది.