News December 1, 2024
గగన్‌యాన్: వ్యోమగాముల తొలి దశ ట్రైనింగ్ పూర్తి

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న గగన్‌యాన్ మిషన్ కోసం వ్యోమగాముల తొలి దశ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇస్రో, నాసా సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో మొదలైన ట్రైనింగ్ సెషన్లో వ్యోమగాములకు మిషన్కి సంబంధించిన ఫెసిలిటీ టూర్స్, లాంచ్ సీక్వెన్సీలను అర్థం చేసుకోవడం, స్పేస్ సూట్ ఫిట్టింగ్, ఫుడ్ ట్రయల్స్‌పై అవగాహన కల్పించారు. కాగా 2026లో గగన్‌యాన్ యాత్ర చేపట్టనున్నారు.
Similar News
News March 10, 2026
ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు బోర్డ్ ఆమోదం తెలపగా ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలను చేపడతారు. డిసెంబరులో 2,500కుపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రిజైన్ చర్చనీయాంశమైంది. ఈ క్రైసిస్‌పై కేంద్రం ఆ సంస్థకు జనవరిలో ₹22కోట్ల పెనాల్టీ విధించింది.
News March 10, 2026
బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చెప్పండి: మనోహర్

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని, గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఎక్కడైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 10, 2026
చమురులో రకాలు.. ఈ విషయం తెలుసా?

అమెరికా, వెనిజులా, ఇరాన్, రష్యాలో లభించే చమురులో ఉండే వ్యత్యాసాల గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన WTI (39–41° API) అత్యంత తేలికైనది కాగా వెనిజులాకు చెందిన Merey (15–16° API) అత్యంత బరువైనది. ఇరాన్ చమురు (33–36° API) మధ్యస్థంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా అనేక రిఫైనరీలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో సరఫరా నిలిస్తే, రిఫైనరీల సామర్థ్యం తగ్గి లాభాలు పడిపోతాయి.


